కర్రకు దుప్పటి కట్టి, అందులో గర్భిణిని పడుకోబెట్టి.. ఆసుపత్రికి తీసుకెళ్లిన వైనం!
Add ap7am to your home Screen

కర్రకు దుప్పటి కట్టి, అందులో గర్భిణిని పడుకోబెట్టి.. ఆసుపత్రికి తీసుకెళ్లిన వైనం!

  • కేరళ పాలక్కడ్‌ ప్రాంతంలో ఘటన
  • అందుబాటులో లేని వైద్య సేవలు
  • 7 కి.మీ నడిచి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ఆధునిక భారతావనిలోనూ సరైన వైద్య సేవలు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం ఎన్నో తంటాలు పడి కొన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. తాజాగా కేరళలోని పాలక్కడ్‌ ప్రాంతంలోని అట్టప్పాడి గ్రామంలో జరిగిన ఓ ఘటన ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.

 ఓ గర్భిణికి పురిటి నొప్పులు రాగా ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఓ కర్రకు దుప్పటి కట్టి గర్భిణిని అందులో ఉంచి ఏకంగా 7 కిలోమీటర్లు మోసుకుని వెళ్లారు. అదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు.       
Kerala
women
hospital

More Telugu News