Karnataka: కర్ణాటకలో ‘కాలా’ను వదలని కష్టాలు!

షార్ట్స్‌లో చూడండి
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కర్ణాటకలో కూడా ఈ సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయినప్పటికీ, కన్నడ సంఘాలు అడ్డుపడ్డాయి. ముఖ్యంగా బెంగళూరులో ఆ సంఘాల కార్యకర్తలు థియేటర్ల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఒకవేళ తమ డిమాండ్‌ను లెక్క చేయకుండా ఆ సినిమాను ప్రదర్శిస్తే ఊరుకోబోమని, విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో కొన్ని థియేటర్లలో పలు షోలను రద్దు చేశారు. థియేటర్ల వద్ద ప్రభుత్వం భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే వుంది.
Go Back to Shorts
Karnataka
kala
Rajinikanth

More Telugu News