'సైరా' నుంచి చిరూ ఫస్టులుక్ రిలీజ్ అప్పుడే
- 'సైరా' తాజా షెడ్యూల్ మొదలు
- 40 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్
- వచ్చే వేసవిలో విడుదల
కొన్నిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ లో తాను పాల్గొన్న సన్నివేశాలకి సంబంధించిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అమితాబ్ పోస్ట్ చేయడం వలన, చిరంజీవి లుక్ ఎలా ఉంటుందనే విషయం తెలిసిపోయింది. అయితే అధికారికంగా ఈ సినిమా నుంచి చిరంజీవి ఫస్టులుక్ ను ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజున మెగా అభిమానులకి పండుగేనని చెప్పాలి. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు.