sai dharam tej: మొత్తానికి నాని 'చిత్రలహరి' తేజు చెంతకి చేరింది!

షార్ట్స్‌లో చూడండి
హీరో నానితో దర్శకుడు కిషోర్ తిరుమల ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని చేయాలనుకున్నాడు. ఫస్టాఫ్ చాలా బాగుందని చెప్పిన నాని, సెకండాఫ్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మార్పులు చేర్పులు చేయడానికి కిషోర్ తిరుమల ప్రయత్నించినా నానిలో ఆ అసంతృప్తి అలా ఉండిపోయింది. దాంతో ఆ కథ సాయిధరమ్ తేజ్ దగ్గరికి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఈ కథకి సాయిధరమ్ తేజ్ ఓకే చెప్పేశాడనేది తాజా సమాచారం. ఈ కథ నచ్చిందని సాయిధరమ్ తేజ్ చెప్పడంతో, వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లడానికి కిషోర్ తిరుమల సన్నాహాలు చేసుకుంటున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాతో పాటు, గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలోను సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఆయన తాజా చిత్రంగా 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.       
Go Back to Shorts
sai dharam tej
nani

More Telugu News