గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాం: ఏపీసీసీ అధ్యక్షుడు
Add ap7am to your home Screen

గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాం: ఏపీసీసీ అధ్యక్షుడు

  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది
  • అందుకే ఏపీలో ఓడిపోయాం
  • తెలంగాణలో కాంగ్రెస్‌ ఓడిపోవడం బాధాకరం
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్‌ ఓడిపోవడం బాధాకరమని, తాము ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తెలంగాణలో గెలిచి అధికారంలోకి రావాలని అన్నారు. ఏపీలోనూ తమ పార్టీ పుంజుకుంటుందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారని, బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అని, ఆ పార్టీని ప్రజలు ఓడించాలని అన్నారు. 
Congress
Telangana
raghuveera

More Telugu News