ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి వెళుతోన్న నేపథ్యంలో చాలా కాల్స్ వచ్చాయి!: ప్రణబ్ ముఖర్జీ
- కాంగ్రెస్ నేతలు సీరియస్!
- ఏం మాట్లాడతానో ఆ కార్యక్రమంలోనే వినండన్న ప్రణబ్
- నాగ్‌పూర్‌లో ఈనెల 7న జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం
ఇటీవల ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం 'వెళ్లండి.. వారి భావజాలంలో లోపం ఎక్కడుందే చెప్పండి' అని అన్నారు. తాజాగా, ప్రణబ్ ముఖర్జీని ఓ జాతీయ మీడియా ఈ విషయంపై స్పందించమని అడగగా... తాను ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో ఏం మాట్లాడుతానో ఆ ప్రోగ్రాంలోనే వినండని అన్నట్లు తెలిసింది. అలాగే, ఆర్‌ఎస్‌ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించిన తరువాత తనకు ఈ విషయంపై పునరాలోచించుకోవాలని చాలా ఫోన్ కాల్స్, లేఖలు వచ్చాయని చెప్పినట్లు సమాచారం.