Andhra Pradesh: 'ఆంధ్రప్రదేశ్‌కు రండి'.. మోత్కుపల్లి నర్సింహులుని కలిసి ముద్రగడ మంతనాలు

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనను కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలిశారు. గత కొంత కాలంగా కాపులకు రిజర్వేషన్లపై చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న ముద్రగడ... మోత్కుపల్లితో మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మోత్కుపల్లిని ఆంధ్రప్రదేశ్‌కి రావాలని ముద్రగడ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య రాజకీయాంశాలపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం.       
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
mothkupally
mudragada

More Telugu News