Nagarjuna: నాన్న జీవితంపై బ‌యోపిక్ కన్నా పుస్తకం తీసుకువస్తే బావుంటుందేమో!: నాగార్జున

టాలీవుడ్ లో ఇపుడు బయోపిక్ ల హవా కొన‌సాగుతోంది. దివగంత నేతలైన ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే బయోపిక్ లు రూపొందుతున్నాయి. ఇదే జోరులో దివంగత అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ వస్తుందని ఫిలింనగర్ లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే అదంతా అవాస్త‌వ‌మ‌ని నాగార్జున తేల్చేశారు.

ఆఫీస‌ర్ మూవీ ప్ర‌చార‌ కార్య‌క్ర‌మంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ.. 'ఏఎన్ఆర్ బ‌యోపిక్ తీద్దామ‌ని గ‌తంలో ఒక‌రు సంప్ర‌దించారు. కానీ నాన్న‌ది అంద‌మైన జీవితం. ఆనందంగా, సాదా సీదాగా ఉండే ఆయ‌న జీవిత నేప‌థ్యంలో సినిమా తీస్తే అందరికి నచ్చుతుందా?.. మనవాళ్లకి కాస్త నెగెటివిటీ ఉండాలి. అవి లేక‌పోతే సినిమాలు ఆడ‌వు కదా? కెరీర్‌లో ఒడిదుడుకులు, ఎత్తు ప‌ల్లాలు, గొడవలు ఉండాలి. కానీ అవేవీ ఆయనకు లేవు. నాన్న జీవితంపై బ‌యోపిక్ కన్నా పుస్తకం తీసుకువస్తే బావుంటుందేమో' అంటూ చెప్పుకొచ్చారు.
Nagarjuna
Tollywood
Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News