Andhra Pradesh: ఏపీలోనూ మా పార్టీని పెట్టమని ఆహ్వానిస్తున్నారు: తెలంగాణ మంత్రి కేటీఆర్‌

షార్ట్స్‌లో చూడండి
నల్గొండకు జిల్లాకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు కొందరు ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన కేటీఆర్‌ సాదరంగా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... తమ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ తమ పార్టీని పెట్టమని అక్కడి వారు ఆహ్వానిస్తున్నారని, అంతేగాక కేసీఆర్‌ బ్యానర్లను సైతం ఏర్పాటు చేసి పాలాభిషేకం చేస్తున్నారని తెలిపారు.

మరోవైపు, మహారాష్ట్రలోని 40 గ్రామాలను తెలంగాణలో కలపాలని అక్కడి వారు ఇటీవల అన్నారని కేటీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణతో పాటు దేశాన్ని ఎన్నో ఏళ్లుగా పరిపాలించిన వారు అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు.            
Go Back to Shorts
Andhra Pradesh
KTR
Telangana
TRS

More Telugu News