ramana dikshitulu: రమణదీక్షితులు ఆగమశాస్త్రాన్ని మంటగలిపారు: ఆనంద సూర్య
రమణదీక్షితులు ఆగమశాస్త్రాన్ని మంటగలిపారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్యమతస్థుడైన కరుణాకర్ రెడ్డి నివాసానికి నాడు రమణదీక్షితులు వెళ్లి ఆశీర్వచనం చేశారని, అన్యమతస్థులకు ఆయన అమ్ముడుపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2013లో అనేక మంది అర్చకులు పదవీ విరమణ చేయలేదా? అప్పుడు, రమణదీక్షితులు ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. బ్రాహ్మణ కులస్తులను టీడీపీకి దూరం చేయాలనేదే బీజేపీ, వైసీపీ కుట్ర అని విమర్శించారు. అమరావతి రాజధానిపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విషం కక్కుతున్నారని, ఐవైఆర్, రమణదీక్షితులపై కేసులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆనందసూర్య చెప్పారు.