Telugudesam: ఏపీ అభివృద్ధికి సహకరించే ఏ పార్టీతోనైనా కలుస్తాం: ఎంపీ కేశినేని

షార్ట్స్‌లో చూడండి
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, ఏపీ అభివృద్ధికి సహకరించే ఏ పార్టీతోనైనా కలుస్తామని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019లో దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారని, బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలను చంద్రబాబు ఏకం చేస్తారని అన్నారు. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోనియా, రాహుల్ ను చంద్రబాబు పలకరిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రస్తుతం బీజేపీకి ఎంత దూరంగా ఉన్నామో.. కాంగ్రెస్ పార్టీకి అంతే దూరంగా ఉన్నామని చెప్పిన కేశినేని, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామంటే అవసరమైతే లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేస్తామని అన్నారు.
Go Back to Shorts
Telugudesam
Kesineni Nani

More Telugu News