ఇలియానా ఏ మాత్రం తగ్గడం లేదు .. 2 కోట్లు అడిగేసిందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇలియానా ఏ మాత్రం తగ్గడం లేదు .. 2 కోట్లు అడిగేసిందట!

  • షూటింగు దశలో 'అమర్ అక్బర్ ఆంటోని'
  • ఒక కథానాయికగా ఇలియానా 
  • రవితేజతో ఆమెకి ఇది నాల్గవ సినిమా   
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో ఇలియానా ఒకరు. తెలుగులో అగ్ర హీరోల జోడీ కడుతూ, యూత్ ను ఒక ఊపు ఊపేసింది. అలాంటి ఇలియానా బాలీవుడ్ సినిమాల పట్ల ఆసక్తితో తెలుగు సినిమాలకి దూరమైంది. తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె ఎదురుచూస్తోన్న సమయంలోనే ఆమెకి ఇక్కడి నుంచి అవకాశం వెళ్లింది .. అదీ రవితేజ సరసన.రవితేజ హీరోగా శ్రీను వైట్ల 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికల అవసరం ఉండగా, ఒక కథానాయికగా ఇలియానాను ఎంపిక చేసుకున్నారట. ఇందుకోసం ఆమె 2 కోట్ల పారితోషికం డిమాండ్ చేయగా నిర్మాతలు అంగీకరించినట్టుగా సమాచారం. ఇంత గ్యాప్ తరువాత కూడా ఇలియానా పారితోషికం విషయంలో ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషం. గతంలో రవితేజ .. ఇలియానా కాంబినేషన్లో 3 సినిమాలు రాగా వాటిలో 'కిక్' సూపర్ హిట్ అయింది.   
raviteja
ileana

More Telugu News