విశ్వాస పరీక్షకు ముందే సీఎం యడ్యూరప్ప రాజీనామా చేస్తారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్
- మా ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ తిరిగి వచ్చారు
- ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు
- కాంగ్రెస్‌కు ద్రోహం చేయరు
కనపడకుండా పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ బెంగళూరులోని గోల్డ్‌ఫించ్ హోటల్‌లో ఉన్నట్లు పోలీసులకు తెలియడంతో వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ విషయంపై మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శివ కుమార్.. తమ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ తిరిగి వచ్చేశారని, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. ఆయన కాంగ్రెస్‌కు ద్రోహం చేయరని వ్యాఖ్యానించారు. అలాగే విశ్వాస పరీక్షకు ముందే సీఎం యడ్యూరప్ప రాజీనామా చేస్తారని శివ కుమార్ పేర్కొన్నారు.