వరుస అవకాశాలతో బిజీ బిజీగా మారిపోయిన 'రంగమ్మత్త'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుస అవకాశాలతో బిజీ బిజీగా మారిపోయిన 'రంగమ్మత్త'

  • 'రంగమ్మత్త'గా మార్కులు కొట్టేసిన అనసూయ
  • 'వేరీజ్ వెంకటలక్ష్మి'గా మరో విలక్షణ పాత్ర 
  • ఆమె కోసం కొత్త పాత్రల సృష్టి
బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యాంకర్స్ లో అనసూయ ఒకరు. అయితే ఆ క్రేజ్ కారణంగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, ఆమె బుల్లితెరను వదిలేయకుండా కెరియర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. తనకి నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ వెళుతోంది. అలా రీసెంట్ గా ఆమె చేసిన 'రంగస్థలం' సినిమాలోని 'రంగమ్మత్త' పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

దాంతో కొత్తగా అనసూయను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన పాత్రలను సృష్టించడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరింత బిజీగా మారిపోయింది. ప్రస్తుతం 'సచ్చిందిరా గొర్రె' .. 'వేరీజ్ వెంకటలక్ష్మి' సినిమాల్లో ప్రధానమైన పాత్రలను చేస్తోంది. అలాగే వెంకటేశ్ .. వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి చేస్తోన్న మల్టిస్టారర్లోను ఒక కీలకమైన పాత్రను చేయనుంది. ఈ పాత్ర ఆమెకి 'రంగమ్మత్త' స్థాయిలో పేరు తెచ్చిపెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అనసూయ .. మిగతావాళ్లు అసూయపడే స్థాయికి చేరుకున్నట్టే. 
anasuya

More Telugu News