ఆటో ట్రాలీలో రూ. 40 కోట్లు... నల్గొండ ఎస్బీఐ అధికారుల నిర్వాకం!
- రక్షణ లేకుండా తరలించేందుకు ఏర్పాట్లు
- పోలీసులకు సమాచారం ఇచ్చిన పౌరులు
- బ్యాంకు అధికారులను నిలదీసిన పోలీసులు
- ఆపై సెక్యూరిటీ ఇచ్చి నగదు తరలింపు
ఈ విషయాన్ని గమనించిన కొందరు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా, సీఐ, ఎస్ఐ తదితరులు రంగంలోకి దిగారు. ఇంత భారీగా నగదును సెక్యూరిటీ లేకుండా ఎలా పంపుతున్నారని నిలదీశారు. నగరంలోని మరో ప్రాంతానికే అయినా, సెక్యూరిటీ లేకుండా పంపడం సరికాదని, తమకు సమాచారం ఇవ్వాల్సి వుందని అన్నారు. ఆపై సెక్యూరిటీని ఏర్పాటు చేసి డబ్బును తరలించారు.