రేపు అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్న పవన్ కల్యాణ్!
- తొలి స్వాతంత్ర్య పోరాటాన్ని తలుచుకుంటూ కార్యక్రమం
- హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జనసేన వేడుక
- 22,326 చ.అడుగుల జాతీయ పతాక ఆవిష్కరణ
తొలి స్వాతంత్ర్య పోరాటంగా చరిత్రకారులు పేర్కొనే ఆ సిపాయిల తిరుగుబాటును తలుచుకుంటూ రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఓ భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. రేపు ఉదయం 10 గంటలకు ప్రపంచ అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని (22,326 చ.అడుగులు) ఎగురవేయనున్నట్లు పేర్కొంది.