తాను కదలకుండా కథను నడిపించగలిగే మహానటి సావిత్రి: చిరంజీవి

తాను కదలకుండా కథను నడిపించగలిగే మహానటి సావిత్రి: చిరంజీవి

  • నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘మహానటి’
  • చిరంజీవి వీడియోను విడుదల చేసిన చిత్ర యూనిట్
  • ఈ చిరంజీవి మనసులో ఆమె ఎప్పటికీ చిరంజీవేనన్న మెగాస్టార్
తాను కదలకుండా కథను నడిపించగలిగే మహానటి సావిత్రి అని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘మహానటి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతున్న మెగాస్టార్ చిరంజీవి వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ..  చిత్ర పరిశ్రమలో ఎందరో నటీమణులున్నా సావిత్రి మాత్రమే మహానటి అని పేర్కొన్న చిరంజీవి.. ఆమెతో కలిసి నటించే అదృష్టం కెరీర్ తొలినాళ్లలోనే దక్కినందుకు గర్వంగా ఉందన్నారు.  కళ్లతోనే హావభావాలు పలికించగలిగిన గొప్ప నటి సావిత్రి అని కొనియాడారు. తాను కదలకుండా కథను నడిపించగలిగే గొప్ప నటి అన్నారు. నటిగా, వ్యక్తిగా, అమ్మగా, స్ఫూర్తిప్రదాతగా సావిత్రమ్మ ఈ చిరంజీవి మనసులో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ శుభాకాంక్షలు తెలిపారు. అలనాటి మహానటి మీద సినిమా తీసి నేటి తరాలకు ఆమె గొప్పతనాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్న చిత్ర యూనిట్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు.<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FMahanatiTheFilm%2Fvideos%2F1461903523919910%2F&show_text=0&width=560" width="560" height="315" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>
Chiranjeevi
Megastar
Tollywood
Mahanati
savitri

More Telugu News