ఈ సమస్యలేవీ నా జీవితంలో రాలేదు... దేవుడికి కృతజ్ఞతలు: సమంత
- విశాల్ తో కలసి 'ఇరుంబుతిరై' చేసిన సమంత
- ఇంటర్నెట్ సమస్యలను చర్చించిన చిత్రం
- తనకు సైబర్ సమస్యలు ఎదురుకాలేదని వెల్లడి
ఈ కథను దర్శకుడు మిత్రన్ తనకు వినిపించినప్పుడు, మీడియా, నెట్ ద్వారా ఇన్ని సమస్యలు ఉంటాయా? అని అనిపించిందని, కథ విన్నాక తన ఫోన్ ను తాకాలంటేనే భయం వేసిందని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో కనిపించే ప్రాబ్లమ్స్ తన జీవితంలో ఎన్నడూ రాలేదని, అందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని పేర్కొంది. తన స్నేహితులు కొందరికి ఇటువంటి సమస్యలే ఎదురయ్యాయని, సోషల్ మీడియాను సరైన రీతిలో ఉపయోగించుకోవాలన్న సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుందని వ్యాఖ్యానించింది.