'సూర్య' ప్రతాపం ఏమేరకు?.. బన్నీ సినిమాపై ప్రేక్షకుల మిశ్రమ స్పందన!
- నేడు విడుదలైన నా పేరు సూర్య
- అల్లు అర్జున్ నటన సూపరంటూ కామెంట్లు
- సిల్లీ అటెంప్ట్ అని, పాటలే మైనస్ అని వ్యాఖ్యలు
- మొత్తం మీద మిశ్రమ స్పందన
అల్లు అర్జున్, అర్జున్ ల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయని అంటున్నారు. ఇక ఇదో సిల్లీ అటెంప్ట్ అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. కథలో విషయం లేకపోయినా స్క్రీన్ ప్లే బాగుందని చెబుతున్నారు. ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయట. ఇక ఈ సమ్మర్ లో 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా'తో టాలీవుడ్ సమ్మర్ హ్యాట్రిక్ కొడుతుందా? లేదా? అన్నది అతి త్వరలోనే తేలిపోతుంది.