'రంగస్థలం' నెల రోజుల కలెక్షన్లను 12 రోజుల్లోనే పట్టేసిన 'భరత్ అనే నేను'!
Add ap7am to your home Screen

'రంగస్థలం' నెల రోజుల కలెక్షన్లను 12 రోజుల్లోనే పట్టేసిన 'భరత్ అనే నేను'!

  • నెల రోజుల్లో రూ. 200 కోట్ల కలెక్షన్లు సాధించిన 'రంగస్థలం'
  • 12 రోజుల్లో అంతే మొత్తం సంపాదించిన 'భరత్ అనే నేను'
  • సరికొత్త నాన్ బాహుబలి రికార్డు కలెక్షన్లు ఖాయమంటున్న ట్రేడ్ వర్గాలు 
సుమారు నెల రోజుల క్రితం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'రంగస్థలం' నిన్న రూ. 200 కోట్ల క్లబ్ లో ప్రవేశించి, ఆ ఘనత సాధించిన తొలి తెలుగు నాన్ బాహుబలి చిత్రంగా రికార్డు సృష్టించిన తరువాత, గంటల వ్యవధిలోనే ఆ ఘనతను మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'భరత్ అనే నేను' కొట్టేసింది.

ట్రేడ్ విశ్లేషకుడు, ఇండస్ట్రీ అనలిస్ట్ రమేష్ బాలా తన ట్విట్టర్ లో వెల్లడించిన వివరాల ప్రకారం, 'భరత్ అనే నేను' యూఎస్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఇప్పటికీ దూసుకెళుతోంది. యూఎస్ లో రూ. 21.32 కోట్లు (3.12 మిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియాలో రూ. 2.23 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. సినిమా కలెక్షన్లు రూ. 200 కోట్లను తాకాయని, అతి త్వరలోనే రూ. 250 కోట్లకు కలెక్షన్లు చేరుతాయని సినీ వర్గాల అంచనా.

రిలీజ్ అయిన తరువాత 12 రోజుల్లోనే 'భరత్ అనే నేను' చిత్రం 'రంగస్థలం' కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఇక అతికొద్ది రోజుల్లోనే 'రంగస్థలం' కలెక్షన్లను ఈ చిత్రం దాటేస్తుందని అంచనా.
Rangasthalam
Bharath Ane Nenu
Mahesh Babu
Ramcharan

More Telugu News