సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కీర్తికి ఫ్లాప్ సినిమా తెచ్చిన ఛాన్స్!
  • రవితేజ సినిమా విడుదలలో మార్పు లేదట
  • 'మిర్చి' కాంబినేషన్ రిపీట్ కానుందా?     

*  తను నటించిన ఫ్లాప్ సినిమా తనకు 'మహానటి' సినిమాలో నటించే అవకాశాన్ని తెచ్చిపెట్టిందని అంటోంది కథానాయిక కీర్తి సురేశ్. రెండేళ్ల క్రితం కీర్తి 'తొడరి' అనే యాక్షన్ థ్రిల్లర్ లో నటించింది. అయితే, అది హిట్ కాలేదు. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ చూడడం జరిగిందట. అది చూశాక, సావిత్రి పాత్రకు కీర్తి బాగా సరిపోతుందని నిర్ణయించుకుని 'మహానటి' చిత్రానికి ఆమెను బుక్ చేసుకున్నాడట. ఈ విషయాన్ని కీర్తి తాజాగా వెల్లడించింది.
*  రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'నేల టిక్కెట్' చిత్రం విడుదల వాయిదా పడుతుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు స్పందిస్తూ, విడుదల తేదీలో ఎటువంటి మార్పూ ఉండదని, మే 24న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది.
*  తాజాగా 'భరత్ అనే నేను' చిత్రంతో మరో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు కొరటాల శివ తన తొలి చిత్రం హీరో ప్రభాస్ తో మరో చిత్రాన్ని చేయనున్నాడట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా కొరటాల దర్శకత్వంలో 'మిర్చి' చిత్రం వచ్చిన సంగతి విదితమే.    
Keerthi
Raviteja
Prabhas

More Telugu News