వైసీపీలో చేరిన కాటసాని... ఆహ్వానించిన జగన్
- జగన్ సమక్షంలో చేరిక
- భారీ కాన్వాయ్ తో వచ్చిన కాటసాని
- వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచన
కాటసానితో పాటు వచ్చిన వందలాది మంది ఆయన అనుచరులు కూడా వైకాపాలో చేరారు. కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా జగన్ వారికి సూచించారు. కాటసాని మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న నిర్విరామ పోరాటాన్ని చూసి తాను స్ఫూర్తి పొందానని, ఇకపై ఆయన అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు.