సంచలనం సృష్టించిన పదేళ్ల బాలిక రేప్ కేసులో మౌల్వి అరెస్ట్
- ఈ నెల 21న స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లి అదృశ్యమైన బాలిక
- మదర్సాలోకి లాక్కెళ్లి బాలికపై అత్యాచారం
- కీలక నిందితుడైన టీనేజర్ ఇప్పటికే అరెస్ట్
టీనేజరే తనను మదర్సాలోకి లాక్కెళ్లాడని బాధిత బాలిక మేజిస్ట్రేట్‌కు తెలిపింది. తన స్నేహితురాలిని కలుసుకునేందుకు వెళ్లగా... ఆమె అన్న తన వద్దకు వచ్చి సోదరి వద్దకు తీసుకెళతానని చెప్పాడని పేర్కొంది. అనంతరం మదర్సాలోకి లాక్కెళ్లి మౌల్వితో కలిసి తనపై అత్యాచారం చేశాడని బాలిక తనతో చెప్పిందని ఆమె మేనమామ తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన 17 ఏళ్ల టీనేజర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని జువెనైల్ కోర్టుకు తరలించారు. మరో నిందితుడైన మౌల్వీని కూడా అరెస్ట్ చేయాలంటూ బాధితులు, హిందూత్వ సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం సాయంత్రం మౌల్వీని అరెస్ట్ చేశారు.