Pawan Kalyan: ఆవిష్కరణకు సిద్ధంగా ఏడడుగుల పవన్ కల్యాణ్ విగ్రహం !

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన అభిమానులు ఎంతటి అభిమానం కనపరుస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ అభిమాని అయితే, ఏకంగా పవన్ కల్యాణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఏడున్నర అడుగుల పవన్ నిలువెత్తు విగ్రహం నెలకొల్పాడు.

తెలుపు రంగు ప్యాంటు, ఖాకీ రంగు లాల్చీతో ఉన్న ఈ విగ్రహం మెడలో జనసేన పార్టీ కండువా, నడుముకు ‘గబ్బర్ సింగ్’ టవల్ చుట్టి ఉన్నాయి. విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇంకా జరగలేదు. ఈ విగ్రహాం ఫొటో ఇప్పటికే సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది. కాగా, శ్రీకాకుళంలో పవన్ కల్యాణ్ కు గుడి కట్టాలని ఉందని ‘జబర్దస్త్’ నటుడు షకలక శంకర్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ గుడి కట్టేందుకు తగిన స్థలం దొరక్కపోవడంతో ఈ నిర్మాణం ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. 
Go Back to Shorts
Pawan Kalyan
tadepallegudem

More Telugu News