పవన్ కల్యాణ్, ఆయన అనుచరులపై ‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్, ఆయన అనుచరులపై ‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు

  • సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేయడం  సబబు కాదు
  • ‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’ యాజమాన్యం ఫిర్యాదు
సామాజిక మాధ్యమాల్లో ‘ఏబీఎన్’, ‘ఆంధ్రజ్యోతి’లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆయన అనుచరులపై సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులో నమోదైంది. తప్పుడు ప్రచారంతో పాటు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేయడంపై చర్యలు తీసుకోవాలని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ ఫిర్యాదు చేసింది.

కాగా, మీడియాపై పవన్ కల్యాణ్ బెదిరింపు ధోరణి సరైనది కాదని, తన ధోరణి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జర్నలిస్టులు హెచ్చరించారు. ఒక మీడియా సంస్థను టార్గెట్ చేస్తే మిగిలిన మీడియా సంస్థలు స్పందించకుండా ఉండటం మంచిది కాదని, అందరూ కలిసికట్టుగా పోరాడాలని జర్నలిస్టు సంఘాలు పిలుపు నిచ్చాయి.
Pawan Kalyan
ccs police

More Telugu News