ఫుల్ ట్యాంక్ పెట్రోలు వద్దు... పేలుతుంది: బంకుల వద్ద హెచ్చరిక బోర్డులు!
- వాహనాల్లో అధిక నిల్వలు వద్దు
- నిండా పెట్రోలు పోయించుకోవద్దు
- హెచ్చరిస్తున్న పెట్రోలు బంకులు
ఇదిలావుండగా, హైదరాబాద్ పరిధిలో ఉన్న 50 లక్షలకు పైగా వాహనాలు నిత్యమూ 40 లక్షల లీటర్ల పెట్రోలు, 30 లక్షల లీటర్ల డీజెల్ ను వినియోగిస్తున్నాయి. ఇక రోజూ ధరలు పెరుగుతూ ఉండటంతో, బంకులకు వెళ్లిన వాహనదారులు, ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎండల నేపథ్యంలో 20 శాతం ఇంధనం గాలిలో ఆవిరై కలుస్తోందని ఈ రంగం నిపుణులు అంచనా వేస్తున్నారు. వాహనాన్ని ఎండలో ఉంచడం కారణంగా, ఉష్ణతాపానికి పెట్రోలు ఆవిరైపోతోంది.