Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమానులుగా ఆయన చెప్పింది చేస్తాం: ‘జబర్దస్త్’ నటుడు షకలక శంకర్
పవన్ కల్యాణ్ అభిమానులుగా ఆయన చెప్పింది తాము చేస్తామని ‘జబర్దస్త్’ నటుడు షకలక శంకర్ అన్నాడు. శ్రీకాకుళంలో జనసేన పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ‘ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు’ ర్యాలీలో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, మీడియాపై పవన్ అభిమానులు దాడి చేయడం సమర్థనీయమేనని అన్నాడు.
‘ఆయన (పవన్ కల్యాణ్) ఏదంటే అదే! అభిమానులుగా ఆయన ఏది చెబితే అదే చేస్తాం. అసలు, దాడి చేయమని ఆయన చెప్పరు. ఒకవేళ చెబితే.. అభిమానులుగా శిరసావహించాలి’ అని చెప్పాడు. ‘ఏబీఎన్’ వాహనాలపై పవన్ అభిమానులు ఇటీవల చేసిన దాడి విషయమై ప్రశ్నించగా, ‘దాడి అందరూ చేస్తారా? ఎవరో కొంత మంది ఉంటారు!’ అని షకలక శంకర్ సమాధానమిచ్చాడు.