నేనెప్పుడూ చెప్పలేదు.. రెండేళ్లుగా చాలా ఒత్తిడికి గురయ్యాను: మహేశ్‌ బాబు
Add ap7am to your home Screen

నేనెప్పుడూ చెప్పలేదు.. రెండేళ్లుగా చాలా ఒత్తిడికి గురయ్యాను: మహేశ్‌ బాబు

  • ఎలా రియాక్ట్‌ అవ్వాలో కూడా తెలియట్లేదు
  • ఇప్పుడు రిలీఫ్‌ అయ్యాను
  • నిర్మాత దానయ్యతో మరో సినిమా తీయాలని ఉంది
తన కొత్త సినిమా 'భరత్‌ అనే నేను'కి ఇంతటి పాజిటివ్‌ స్పందన ఇచ్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని సినీనటుడు మహేశ్‌ బాబు అన్నాడు. ఈ రోజు నిర్వహించిన 'భరత్‌ అనే నేను' సక్సెస్‌ మీట్‌లో మీడియాతో మహేశ్‌ బాబు మాట్లాడుతూ.. 'నేనెప్పుడూ చెప్పలేదు.. రెండేళ్లుగా చాలా ఒత్తిడికి గురయ్యాను.. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. ఎలా రియాక్ట్‌ అవ్వాలో కూడా తెలియట్లేదు.. రిలీఫ్‌ అయ్యాను..' అన్నాడు.

'శ్రీమంతుడు'తో తనకు హిట్‌ ఇచ్చిన కొరటాల శివ తనకు మళ్లీ హిట్‌ ఇచ్చారని, తాను పడుతోన్న టెన్షన్‌ను తొలగించారని పేర్కొన్నాడు. ఈ సినిమా బృందం మొత్తానికి థ్యాంక్స్‌ చెబుతున్నానని అన్నాడు. నిర్మాత దానయ్యతో మరో సినిమా తీయాలని ఉందని అన్నారు. కాగా, మహేశ్‌ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళుతోన్న విషయం తెలిసిందే.   
Mahesh Babu
Koratala Siva
Bharath Ane Nenu

More Telugu News