TRS: ఎన్నికలకు ముందు ఈ ప్లీనరీ అత్యంత కీలకం.. దేశ రాజకీయాలపై కేసీఆర్‌ చర్చిస్తారు: కేటీఆర్‌

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికలకు ముందు జరగబోయే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ అత్యంత కీలకమని, ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కూడా చర్చిస్తారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో ఈ నెల 27న జరగబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు.

 ఈ రోజు కొంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ... ఈ ప్లీనరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, దీనికి 13 వేల మంది హాజరుకానున్నారని అన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్లీనరీకి వచ్చే వారి కోసం అంబలి, మజ్జిగ, నీరు వంటి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని, మంచి భోజన సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. 
Go Back to Shorts
TRS
KTR
KCR

More Telugu News