మహేశ్‌బాబు సినిమాపై జూ.ఎన్టీఆర్‌ ప్రశంసల జల్లు
Add ap7am to your home Screen

మహేశ్‌బాబు సినిమాపై జూ.ఎన్టీఆర్‌ ప్రశంసల జల్లు

  • సామాజిక బాధ్యతను కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కలిపి సినిమా తీశారు
  • ఇలా తీయడం అంత తేలికైన విషయం కాదు
  • కొరటాల శివ ఈ రెండు అంశాలను చక్కగా బ్యాలెన్స్‌ చేశాడు
  • మహేశ్‌ బాబుకి శుభాకాంక్షలు
టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన మహేశ్‌ బాబు నటించిన 'భరత్‌ అనే నేను' సినిమాకు మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్‌ బాబు.. ముఖ్యమంత్రి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ ఈ సినిమాపై స్పందిస్తూ ట్వీట్ చేశాడు.

సామాజిక బాధ్యతను కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కలిపి సినిమా తీయడం అంత తేలికైన విషయం కాదని, దర్శకుడు కొరటాల శివ ఈ రెండు అంశాలను చాలా చక్కగా బ్యాలెన్స్‌ చేశాడని తారక్‌ పేర్కొన్నాడు. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన మహేశ్‌ బాబుకి శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నాడు. ఎప్పటికీ చెప్పుకోదగ్గ మంచి సినిమా తీసినందుకు 'భరత్‌ అనే నేను' సినీ బృందానికి కూడా శుభాకాంక్షలు చెబుతున్నానని తారక్‌ ట్వీట్లు చేశాడు.      
Bharath Ane Nenu
ntr
Mahesh Babu

More Telugu News