కత్తి మహేశ్ చెప్పింది కరెక్టేనంటూ పవన్ కల్యాణ్ కు సలహా ఇచ్చిన దర్శకుడు వర్మ!
Add ap7am to your home Screen

కత్తి మహేశ్ చెప్పింది కరెక్టేనంటూ పవన్ కల్యాణ్ కు సలహా ఇచ్చిన దర్శకుడు వర్మ!

  • అరెస్టయిన అభిమానులకు సాయపడమంటూ కత్తి మహేశ్ ట్వీట్
  • ఆ ట్వీట్ పై ప్రతి స్పందించిన దర్శకుడు వర్మ
  • ‘మెగా’ కుటుంబంతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి అభిమానులకు మద్దతివ్వాలంటూ సలహా
హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ వద్ద ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ వాహనాలను ధ్వంసం చేసిన పవన్ కల్యాణ్ అభిమానులను బంజారా హిల్స్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. కాగా, దీనిపై ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ స్పందిస్తూ చేసిన ట్వీట్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతి స్పందించారు.

కత్తి మహేశ్ తన ట్వీట్ లో ..‘పవన్ కల్యాణ్ మీ ఫ్యాన్స్ కు హెల్ప్ చేయి.. ఈసారి పారిపోవద్దు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాహనాలను ధ్వంసం చేయడంతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. జేఎస్పీ లీడర్, నటుడు పవన్ కల్యాణ్ కు అభిమానులమని వారు చెబుతున్నారు. నిందితులను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. ‘ఎస్.. మీరు చెప్పింది కరెక్టు.. ఫిల్మ్ చాంబర్ కు ఏ విధంగా అయితే అతను వెళ్లారో, అదే విధంగా ‘మెగా’ కుటుంబంతో కలిసి అతను పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారికి మద్దతుగా నిలవాలి’ అని పవన్  కల్యాణ్ పేరును ప్రస్తావించకుండా వర్మ పరోక్షంగా సలహా ఇచ్చారు.
Pawan Kalyan
ramgopal varma
Kathi Mahesh

More Telugu News