Pawan Kalyan: ‘అజ్ఞాతవాసి’ ఎవరో వెల్లడించిన పవన్ కల్యాణ్!

షార్ట్స్‌లో చూడండి
సంబంధం లేని విషయాల్లోకి తనను లాగి, తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక ఉన్న నిజమైన ‘అజ్ఞాతవాసి’ ఎవరో తెలుసా? అంటూ ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ‘అజ్ఞాతవాసి’ ఎవరో చెబుతూ తాజాగా పవన్ మరో ట్వీట్ చేశాడు.  ‘అజ్ఞాతవాసి’ గా టీవీ 9 చానెల్ సీఈఓ రవిప్రకాష్ పేరును చెప్పిన పవన్, టీవీ 9 యజమాని శ్రీనిరాజుపై నిప్పులు చెరిగారు.

 టీవీ 9 చానెల్ తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపిందని, రవిప్రకాష్ మార్గదర్శకత్వంలో తన తల్లిని చెప్పరాని మాటలతో పదే పదే తిట్టించారని అన్నారు. శ్రీ సిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కైన రవి ప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేంటని శ్రీనిరాజుని ప్రశ్నించారు. శ్రీనిరాజు తనకు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan

More Telugu News