విడుదలకు ముందే 'భరత్ అనే నేను' రికార్డు!
Add ap7am to your home Screen

విడుదలకు ముందే 'భరత్ అనే నేను' రికార్డు!

  • 2000 థియేటర్లలో ప్రీమియర్ షోలు
  • విదేశాల్లో 1000 థియేటర్లలో ప్రదర్శన
  • హిట్ అయితే, వీకెండ్ లో 3 మిలియన్ డాలర్ల కలెక్షన్లు ఖాయం!
మహేష్ బాబు హీరోగా నిర్మితమై రానున్న శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన 'భరత్ అనే నేను' విడుదలకు ముందే రికార్డు బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా 2000 థియేటర్లలో ఈ చిత్రం ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. మహేష్ బాబు సీఎం క్యారెక్టర్ లో నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోగా, అమెరికాలో గతంలో మహేష్ చిత్రాలు విడుదలైన థియేటర్ల సంఖ్యకు మించి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపింది.

యూఎస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ల అమ్మకం ప్రారంభమైందని యూనిట్ వెల్లడించింది. మొత్తం 1000 సినిమా హాల్స్ లో చిత్రం విడుదలవుతుందని తెలిపింది. అంటే 'బాహుబలి-2'కు సమానంగా 'భరత్ అనే నేను' విడుదల కానుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే, తొలి వీకెండ్ లో 3 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్ రావచ్చని కూడా భావిస్తున్నారు.

కాగా, ఇండియాలో సైతం 'బుక్ మై షో' వంటి వెబ్ సైట్లలో సినిమా టికెట్ల అమ్మకం ప్రారంభం కాగా, తొలిరోజు టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి. 
Bharath Ane Nenu
Mahesh Babu
Premier Shows

More Telugu News