Jagan: ఈ సినిమాలో చంద్రబాబే విలన్... బాది బొక్కలో పెడతాం!: జగన్

షార్ట్స్‌లో చూడండి
గడచిన నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఆంధ్రులకు సినిమాలు చూపిస్తున్నారని, ఈ సినిమాలో ఉత్తమ విలన్ ఆయనేనని, ఆ విలన్ ను బాది బొక్కలో పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తన ప్రజా సంకల్ప యాత్ర 137వ రోజులో భాగంగా విజయవాడ చిట్టినగర్ లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

 చంద్రబాబు చూపిస్తున్న సినిమా పేరు 'ఓ భ్రమరావతి... ఓ రాజధాని... ఓ అవినీతి కథ' అని చెప్పిన జగన్, ఈ సినిమాలో హీరో ఇంకా ఎంటర్ కాలేదని అన్నారు. ఈ సినిమా నాలుగేళ్ల క్రితం ప్రారంభమైందని, ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు. తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల నోట్లో చంద్రబాబు మట్టి కొట్టారని నిప్పులు చెరిగారు. రాజధాని నూజివీడు దగ్గరని ఓసారి, నాగార్జునా వర్శిటీ దగ్గరని మరోసారి, ఏలూరు రోడ్డులో వస్తుందని ఇంకోసారి లీకులు ఇస్తూ, తన బినామీలతో గుంటూరు, విజయవాడ మధ్య అమరావతి ప్రాంతంలో భూములను కొనుగోలు చేయించారని ఆరోపించారు.

 ఆ తరువాత రాజధానిని ప్రకటించిన ఆయన్ను ఏం చేయాలని ప్రశ్నించారు. రైతులను మాయచేసి, ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. తన బినామీలతో కొనుగోలు చేయించిన భూములను బిజినెస్ జోన్ లో, సాధారణ రైతుల భూములను ఫార్మింగ్ జోన్ లో పెట్టిన ఘనుడు ఆయనని విమర్శలు గుప్పించారు. వేసుకున్న పంటలను తగులబెట్టిన ఘనతను కూడా దక్కించుకున్నారని, అసైన్డ్ భూములను, లంక భూములను కూడా వదలని రాక్షసుడు చంద్రబాబని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Jagan
Chandrababu
YSRCP
Amaravati

More Telugu News