దుమ్మురేపిన ఇండియన్స్... కామన్వెల్త్ లో ఒకే రోజు ఎనిమిది స్వర్ణాలు!
- అద్భుత ఆటతీరుతో చెలరేగిన భారత క్రీడాకారులు
- చరిత్ర సృష్టించిన మనికా బాత్రా, మేరీ కోమ్
- తెలుగుతేజం సిక్కిరెడ్డికి కాంస్యం
- 25కు పెరిగిన స్వర్ణాలు
షూటింగ్ విభాగంలో పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ ఫైనల్ లో సంజీవ్ రాజ్ పుత్ 454.5 పాయింట్లతో స్వర్ణం సాధించాడు. ఒలింపియన్ గగన్ నారంగ్ రికార్డును రాజ్ పుత్ తిరగరాయడం గమనార్హం. బాక్సింగ్ లో మేరీకోమ్ తో పాటు 52 కిలోల విభాగంలో గౌరవ్ సోలంకి, 75 కిలోల విభాగంలో వికాస్ కిషన్ లకు స్వర్ణాలు లభించాయి. బాక్సింగ్ విభాగంలో 2010లో గెలిచిన పతకాల కన్నా రెండు పతకాలను అదనంగా భారత్ కైవసం చేసుకుంది. మొత్తం మీద భారత్ 25 స్వర్ణాలు, 16 రజతాలు, 18 కాంస్యాలతో పతకాల పట్టికలో మూడో స్థానంలో ఉంది. పోటీలు నేటితో ముగియనున్నాయి.