Sania Mirza: నీలాంటి అధమ స్థాయి వ్యక్తులకు సమాధానం చెప్పను: నెటిజన్ పై సానియా మీర్జా ఫైర్

షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకోవడంపై కామెంట్ చేసిన ఓ నెటిజన్ పై టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫైర్ అయింది. వివరాల్లోకి వెళ్తే, కశ్మీర్ లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, చంపేసిన ఘటనపై ఇటీవల ట్విట్టర్లో సానియా స్పందించింది. ఇలాంటి దేశాన్నేనా ప్రపంచానికి మనం చూపించాలనుకుంటున్నది? అని ఆమె ప్రశ్నించింది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మనం ఈ బాలికకు అండగా నిలబడాలని... లేకపోతే అది మానవత్వం అనిపించుకోదని చెప్పింది.

దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ, 'సానియా మీరంటే నాకు ఎంతో గౌరవం. మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. పాక్ వ్యక్తిని పెళ్లాడిన మీరు ఇండియన్ కాదు. ఒకవేళ మీరు ట్వీట్ చేయాలనుకుంటే.... పాక్ ఉగ్రమూకలు చంపుతున్న అమాయకుల గురించి ట్వీట్ చేయండి' అని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై సానియా మండిపడింది. ఒక వ్యక్తి ఏ దేశానికి చెందిన వ్యక్తినైనా పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది. తాను ఇండియా కోసమే ఆడతానని... ఎప్పటికీ ఇండియన్ గానే ఉంటానని తెలిపింది. తాను ఏ దేశస్తురాలో నీలాంటి అథమ స్థాయి వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదని ఘాటుగా స్పందించింది.
Go Back to Shorts
Sania Mirza
shoib malik
Pakistan
kashmir

More Telugu News