Mahesh Babu: తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను : మహేష్ బాబు

షార్ట్స్‌లో చూడండి
‘కృష్ణ గారబ్బాయనే నేను’ ఇలా మాట్లాడటం తమ్ముడు తారక్ దగ్గర నుంచి తాను నేర్చుకున్నానంటూ హీరో మహేష్ బాబు అన్నారు. ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ,‘ ‘ఆది’ సినిమా ఆడియో వేడుకకు నేను వెళ్లాను. ఇప్పుడు ఈ సినిమా వేడుకకు తారక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి ఫంక్షన్ల ట్రెండ్ మారుతుంది. అందరు హీరోలు వెళతారు. మేము మేమూ బాగానే ఉంటాం. మీరే, ఇంకా బాగా ఉండాలి. ఈ సినిమాలో నా పాత్ర సీఎం అని శివ గారు చెప్పినప్పుడు నాకు వణుకు వచ్చింది. ఇన్సిపిరేషన్ గా తీసుకుని చేశాను. నా సినిమాల్లో నేను అత్యున్నతమైన పర్ఫార్మెన్స్ కనబరిచిన సినిమా ఇది. ఏప్రిల్ 20 మా అమ్మ ఇందిరమ్మ గారు పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు, దీవెనలకు మించినవేవీ ఉండవంటారు! ఆ రోజున నా సినిమా విడుదలకానుండటం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నాడు.
Go Back to Shorts
Mahesh Babu
Bharath Ane Nenu

More Telugu News