ప్రకాష్ రాజ్ మాట్లాడుతుండగా ‘ఫాదర్’ అంటూ అభిమానుల గోల!
Add ap7am to your home Screen

ప్రకాష్ రాజ్ మాట్లాడుతుండగా ‘ఫాదర్’ అంటూ అభిమానుల గోల!

  • ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన ప్రకాష్ రాజ్
  • ప్రకాష్ రాజ్ ని మాట్లాడనివ్వని అభిమానులు
  • నొచ్చుకున్న ప్రకాష్ రాజు .. వేదికపై నుంచి వెళ్లిపోయిన వైనం
‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన నటుడు ప్రకాష్ రాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. వేదికపై నుంచి ప్రకాష్ రాజ్ మాట్లాడటం ప్రారంభించిన కొంచెం సేపటికే ‘ఫాదర్’ అంటూ ఈ వేడుకకు హాజరైన అభిమానులు నినాదాలు చేశారు. దీంతో, ప్రకాష్ రాజు తన ప్రసంగాన్ని ఆపేసి కొంచెం సేపు నవ్వుతూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ తర్వాత మాట్లాడేందుకు ఉపక్రమిస్తుండగా అభిమానులు అదే రీతిలో ప్రవర్తించడంతో నొచ్చుకున్న ప్రకాష్ రాజు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో, యాంకర్ సుమ కల్పించుకున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
Prakash Raj
Bharath Ane Nenu

More Telugu News