Bharath Ane Nenu: ‘భరత్ అనే నేను’ వేడుకకు భారీగా హాజరైన అభిమానులు

  • హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుక
  • మహేష్ బాబు అభిమానుల ఉత్సాహం
  • ముఖ్యఅతిథిగా హాజరుకానున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన ‘భరత్ అనే నేను’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మరి కొంచెం సేపట్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకకు మహేష్ బాబు అభిమానులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు. మహేశ్ అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. కాగా, మహేశ్ బాబు చిత్ర పటాలను చేతబూనిన అభిమానులు తమ అభిమాన హీరోను చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. 

More Telugu News

Bharath Ane Nenu
Mahesh Babu