shilpa chakravarthi: అప్పట్లో మాకు ఇచ్చిన రెమ్యునరేషన్ వందల్లో .. ఇప్పుడు యాంకర్స్ కి వేలల్లో!: యాంకర్ శిల్పా చక్రవర్తి

షార్ట్స్‌లో చూడండి
ఇప్పుడు సీనియర్ యాంకర్స్ గా వున్నవారికి కొంతకాలం క్రితం పోటీ ఇచ్చిన యాంకర్ గా శిల్పాచక్రవర్తి కనిపిస్తారు. గలగలా మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను ఆమె ఆకట్టుకున్నారు. అలాంటి శిల్పా చక్రవర్తి తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. తన కెరియర్ గురించి ప్రస్తావించారు.

"నేను యాంకరింగ్ చేసేటప్పుడు ..  సీరియల్స్ లో నటించేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారికి స్కూటర్ కూడా లేదు. కాలేజ్ కి బస్సులో వెళ్లి వచ్చేదానిని. టీవీల్లో కనిపించడం మొదలైన తరువాత .. బస్సుల్లో వెళ్లిరావడం ఇబ్బంది అయింది. అది గమనించి మా అన్నయ్య కూడా బాధపడ్డాడు. అప్పుడు మోపెడ్ కొనాలంటే 40 వేలు ఉండేది .. నాకు వచ్చే రెమ్యునరేషన్ 500. ఇప్పుడు వచ్చిన యాంకర్స్ కి 30 .. 40 వేలు ఇస్తారట. అప్పట్లో మాకు వచ్చేదానికంటే మా చేతిమించి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉండేది" అని చెప్పుకొచ్చారు.       
Go Back to Shorts
shilpa chakravarthi

More Telugu News