విజయ్ మూవీ రీమేక్ లో రవితేజ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ మూవీ రీమేక్ లో రవితేజ!

  • తమిళంలో హిట్ కొట్టిన 'తెరి'
  • పవన్ తో రీమేక్ చేయాలనుకున్న సంతోష్ శ్రీనివాస్
  • కుదరకపోవడంతో రవితేజతో సెట్స్ పైకి
'కందిరీగ' సినిమాతో మాస్ ఆడియన్స్ చేత దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన సంతోష్ శ్రీనివాస్, ఆ తరువాత ఆ స్థాయి సక్సెస్ ను అందుకోలేకపోయాడు. పవన్ కల్యాణ్ తో ఒక సినిమా చేయాలని చాలాకాలం పాటు వెయిట్ చేసిన ఆయనకి నిరాశే ఎదురైంది. దాంతో రవితేజతో చేయడానికి రెడీ అవుతున్నాడు.

 పవన్ తో సంతోష్ శ్రీనివాస్ చేయాలనుకున్నది .. తమిళంలో విజయ్ హిట్ మూవీ 'తెరి'కి రీమేక్. రవితేజతో ఆయన అదే రీమేక్ చేస్తున్నాడా? లేదంటే వేరే కథను సిద్ధం చేసుకున్నాడా? అనే సందేహం కొంతమందిలో తలెత్తింది. పవన్ తో అనుకున్న రీమేక్ నే ఆయన రవితేజతో చేయనున్నాడనేది తాజా సమాచారం. శ్రీను వైట్ల మూవీ తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది.
srinivas
raviteja

More Telugu News