నాకు చాలా పొగరెక్కువని ప్రచారం చేశారు : యాంకర్ శిల్పా చక్రవర్తి
- నేను చాలా కచ్చితంగా మాట్లాడతాను
- కొంతమంది దూరం పెట్టేవారు
- నేనేంటో నాకు బాగా తెలుసు
"నా నటన గురించి .. యాంకరింగ్ గురించి విమర్శించండి స్వీకరిస్తాను .. కానీ వెనుక నుంచి కామెంట్స్ చేస్తే మాత్రం ఊరుకోనని చెప్పేసేదానిని. నేను ఇలా క్లియర్ గా మాట్లాడేస్తాను గనుక, నన్ను కొంతమంది దూరం పెట్టేవారు. నన్ను ఈవెంట్స్ కి పిలిచేవారు .. నాకు రావలసిన ఎమౌంట్ విషయంలో నేను చాలా కచ్చితంగా మాట్లాడేదానిని. అందుకు కారణం అంతకుముందు కొంతమంది ఎగ్గొట్టడమే. అలా మాట్లాడటంతో నాకు పొగరు అని ప్రచారం చేసేవారు. ఇలాంటివాళ్లు ప్రతిచోటా వుంటారు .. నేనేంటో నాకు తెలుసు" అని చెప్పుకొచ్చారు.