Chandrababu: 2019లో చంద్రబాబు ఎవరికి మద్దతిస్తారో వారే ప్రధాని!: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో ఎవరికి మద్దతిస్తారో వారే ప్రధాని అవుతారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ, వైసీపీలపై మండిపడ్డారు. బీజేపీ నేత సోము వీర్రాజు.. వైసీపీ అధినేత జగన్‌తో 2 గంటల పాటు రహస్య మంతనాలు జరిపారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది ప్రాంతాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

సోము వీర్రాజు శకుని రాయబారం చేస్తున్నారని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. సోము వీర్రాజు అవినీతి కూడా సీఎం డాష్ బోర్డులో ఉందని, ఒక పక్క బీజేపీ, మరో పక్క వైసీపీ కలిసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబు నాయుడు సమావేశమై తన ఢిల్లీ పర్యటనపై చర్చిస్తారు.   
Go Back to Shorts
Chandrababu
budda venkanna
Prime Minister

More Telugu News