ప్రాణాలు పోయినా సరే... షమీ దుర్మార్గుడనే చెబుతాను: హసీన్ తాజా ఆరోపణలు
- షమీకి అనుకూలంగా ఉన్న మీడియా
- తప్పు నేనే చేసినట్టు నిందలు
- మరిన్ని సాక్ష్యాలు ఉన్నాయన్న హసీన్
షమీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని, అతను తనను లైంగికంగా వేధించాడని, హత్యాయత్నం కూడా చేశాడనటానికి ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. షమీకి చాలా మందితో సంబంధం ఉందని, మ్యాచ్ ఫిక్సింగ్ కు కూడా పాల్పడ్డాడని గతంలో హసీన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ, ఆ విషయంలో మాత్రం షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన హసీన్, తన వద్ద ఉన్న మరిన్ని సాక్ష్యాలను విడుదల చేస్తానని చెప్పడం గమనార్హం.