పవన్ ‘జనసేన’ను బీజేపీకి అమ్మేశారు!: ఎంపీ కేశినేని నాని
Add ap7am to your home Screen

పవన్ ‘జనసేన’ను బీజేపీకి అమ్మేశారు!: ఎంపీ కేశినేని నాని

  • జేఎఫ్ సీ నివేదిక వచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారు?
  • ఢిల్లీలో పోరాటం చేస్తానన్న పవన్ ఏం చేస్తున్నారు?
  • అఖిలపక్ష సమావేశానికి పవన్ హాజరై ఉంటే బాగుండేది
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ తన పార్టీని పెట్టీపెట్టకముందే బీజేపీకి అమ్మేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు సాధించే వరకు తన పోరాటం ఆగదని చెప్పిన పనవ్, జేఎఫ్ సీ నివేదిక వచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారు? ఢిల్లీలో పోరాటం చేస్తానన్న పవన్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరై ఉంటే బాగుండేదని నాని అభిప్రాయపడ్డారు.
Pawan Kalyan
kesineni nani

More Telugu News