పార్టీలో కీలక మార్పులు చేస్తోన్న రాహుల్‌ గాంధీ
Add ap7am to your home Screen

పార్టీలో కీలక మార్పులు చేస్తోన్న రాహుల్‌ గాంధీ

  • అమిత్‌ చవ్డా (35 )కు గుజరాత్‌ పీసీసీ బాధ్యతలు
  • కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌గా నితిన్‌ రౌత్‌
  • రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల మార్పు తథ్యం
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తమ పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో తమ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన రాహుల్ గాంధీ... చెప్పినట్లుగానే అమిత్‌ చవ్డా (35 ) కు గుజరాత్‌ పీసీసీ బాధ్యతలను అప్పజెపుతూ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తరువాత ఆ పార్టీ సీనియర్‌ నేత భరత్‌ సోలంకి గుజరాత్ పీసీసీ పదవికి రాజీనామా చేయాలని అనుకోగా, రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేయలేదు.

కాగా, తమపార్టీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌గా ఉన్న కొప్పుల రాజును కూడా తొలగించిన రాహుల్ గాంధీ ఆ స్థానంలో నితిన్‌ రౌత్‌ను నియమించారు. రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల మార్పు కూడా చేయనున్నట్లు ఏఐసీసీ తెలిపింది. 
Rahul Gandhi
Congress

More Telugu News