మోదీని దూషించారంటూ సినీ నటుడు శివాజీపై పోలీసులకు ఫిర్యాదు

  • మోదీని ‘ఇడియట్’ అని శివాజీ దూషించారు
  • విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • శివాజీపై కేసు నమోదు చేయాలన్న బీజేపీ నేతలు  
ప్రధాని నరేంద్ర మోదీపై సినీ నటుడు శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ‘ఆపరేషన్ ద్రవిడ’ పేరిట బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన శివాజీ, మోదీని ‘ఇడియట్’ అని దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మోదీ ప్రతిష్టకు భంగం వాటిల్లే వ్యాఖ్యలు చేసిన శివాజీపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు.
Go Back to Shorts
Narendra Modi
artist shivaji

More Telugu News