నన్ను కెలకద్దు... ఉండవల్లికి వార్నింగ్ ఇచ్చిన హీరో శివాజీ!
Add ap7am to your home Screen

నన్ను కెలకద్దు... ఉండవల్లికి వార్నింగ్ ఇచ్చిన హీరో శివాజీ!

  • ఏ ఇద్దరూ ప్రశాంతంగా ఉండకూడదనేది ఉండవల్లి నైజం
  • ఎదుటి వారిపై నిందలు వేస్తూ, బెనిఫిట్ పొందుతుంటారు
  • నన్ను కెలికితే ఉండవల్లి గురించి వీడియో విడుదల చేస్తా
దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునేందుకు ఓ జాతీయ పార్టీ 'ఆపరేషన్ ద్రవిడ' చేపట్టిందంటూ హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇద్దరు విశ్రాంత అధికారులు, ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక సీనియర్ నాయకుడు ఈ ఆపరేషన్ లో సదరు జాతీయ పార్టీకి సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ఉండవల్లి స్పందిస్తూ, ఎవరో చెప్పిన కథను నమ్మి శివాజీ ఇలా చెప్పి ఉంటారని తీసిపారేశారు.

ఈ నేపథ్యంలో, మీరు చెప్పింది ఒక జానపద కథలా ఉందని ఉండవల్లి చెప్పారని... దీనిపై మీ స్పందన ఏమిటంటూ ఓ ఛానల్ శివాజీని ప్రశ్నించింది. దీంతో ఉండవల్లిపై శివాజీ మండిపడ్డారు. ఆపరేషన్ గరుడ గురించి తాను వివరాలను వెల్లడిస్తే... ఉండవల్లికి ఉలుకెందుకని ప్రశ్నించారు. గత 10 నుంచి 12 ఏళ్లుగా ఆయనను తాను గమనిస్తున్నానని... ఏ ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉండకూడదనేని ఉండవల్లి తత్వమని విమర్శించారు. ఏదో ఒక పక్క ఉండి అవతలివారిపై నిందలు వేస్తుంటారని... తద్వారా బెనిఫిట్ పొందుతుంటారని అన్నారు. ఆయన చెబితే భగవద్గీత... మేము చెబితే పిచ్చి మాటలా? అని మండిపడ్డారు. తాను చెప్పింది నమ్మాలని ఉండవల్లిని అడిగానా? అని ఎద్దేవా చేశారు.

నాలుగు రోజులకు ఒకసారి రాజమండ్రిలో ఉండవల్లి ప్రెస్ మీట్ పెడుతుంటారని... ఆయనకు యూట్యూబ్ ఛానల్ ఉందేమో అని తన స్నేహితుడు ఒకరు అన్నారని శివాజీ అన్నారు. మీ బెనిఫిట్స్ కోసం ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే ఎలా అని ఉండవల్లిని ఉద్దేశించి ప్రశ్నించారు. తనకు బెనిఫిట్స్ మీద ఆశ ఉంటే... బీజేపీ నుంచి బయటకు వచ్చేవాడినే కాదని చెప్పారు. తనను కెలికితే గతంలో పోలవరం గురించి ఉండవల్లి మాట్లాడినవన్నీ వీడియోలో పెట్టి చూపిస్తానని హెచ్చరించారు. తాను ప్రశాంతంగా రాష్ట్రం కోసం పని చేస్తున్నానని... తనను రెచ్చగొట్టొద్దని చెప్పారు. 
shivaji
sivaji
Undavalli
video
operation dravida
fire

More Telugu News