Congress: రేపు జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధం!: ర‌ఘువీరారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో తలపెట్టిన జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధ కార్య‌క్ర‌మాన్ని రాజ‌కీయ శ్రేణులు, విద్యార్థి యువ‌జ‌న నాయ‌కులు, మేధావులు, న్యాయ‌వాదులు, కాంగ్రెస్ శ్రేణులు విజ‌య‌వంతం చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.

ఈ మేర‌కు ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల సాధ‌న స‌మితి చేప‌ట్టే జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధనంకు రాష్ట్ర కాంగ్రెస్ క‌మిటీ మ‌ద్ద‌తు ప‌లికింద‌న్నారు. కాంగ్రెస్ నేతలు, నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు ర‌హ‌దారుల దిగ్బంధం కార్య‌క్ర‌మంలో పాల్గొని విజయవంతం చేయాల‌ని పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Congress
apcc
raghuveerareddy
Andhra Pradesh

More Telugu News