'కేంద్రం చెప్పింది', 'కేంద్రం ఇచ్చింది' అంటూ ఎంపీలందరికీ మెసేజ్ పంపిన కేశినేని నాని!
- ఎంపీలకు వాట్స్ యాప్ పోస్టు పంపిన కేశినేని నాని
- హోదా ఇస్తామని చెప్పి ప్యాకేజీ అన్న కేంద్రం
- ప్యాకేజీ నిధులనూ ఇవ్వలేదని వెల్లడి
- చర్చనీయాంశంగా మారిన నాని పోస్టు
ఆపై 'కేంద్రం ఇచ్చింది' ఇదే నంటూ "14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వమన్నందున హోదాకు సరిపడా ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తాం. కాని ఇప్పటివరకూ ఏ విధమైన ప్రత్యేక సాయం అందలేదు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదని పార్లమెంట్ లో హోమ్ శాఖ సహాయమంత్రి తెలిపారు" అని రాశారు. బీజేపీ అబద్ధాలు చెబుతోందని, అందుకు ఇదే సాక్ష్యమని ఆయన ఈ పోస్టు చేయగా, దీన్ని చూసిన ఎంపీలు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.